కూకట్పల్లి, వెలుగు : బార్‌వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండగా.. అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకుని పోలీసులు చితకబాదారు. కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 24న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. పూల వ్యాపారం చేసే ఇంతియాజ్ హైదర్‌నగర్‌లో ఉంటాడు. 24న రాత్రి హైదర్‌నగర్‌లో ముంబయి జాతీయ రహదారి పక్కన నిల్చున్నాడు. ఇదే టైంలో సిరి బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన ఇరు వర్గాలు మద్యం మత్తులో ఘర్షణ పడ్డాయి. కేపీహెచ్‌బీ పోలీసులు అక్కడకు చేరుకుని గొడవ పడుతున్న వారిని వదిలేసి చుట్టుపక్కల వారిపై లాఠీచార్జి చేయగా ఇంతియాజ్ గాయపడ్డాడు. గొడవతో తనకు సంబంధం లేదని మొత్తుకున్నా పట్టించుకోలేదు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రైవేటు దవాఖానలో చికిత్స తీసుకున్నాడు. తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేయడానికి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు వెళితే ఎవరూ స్పందించలేదని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
పూల వ్యాపారిపై పోలీసుల దాడి
- హైదరాబాద్
- November 27, 2024
లేటెస్ట్
- బంగ్లాలో ఓటుహక్కు కనీస వయసును 17కు తగ్గిద్దాం.. యునుస్ ఆంతర్యమేమిటి?
- అండర్19 వరల్డ్ కప్‌కు ఎంపికైన త్రిష, ధ్రుతికి హెచ్‌సీఏ ఘన సన్మానం
- ఓయో రూమ్స్‌లో పేకాట రాయుళ్ల అరెస్టు.. భారీగా నగదు స్వాధీనం
- ఇస్రో మరో ప్రయోగం.. రేపు PSLV-C60 కౌంట్‌డౌన్
- పార్టీలోకి రండి.. సీఎం తీసుకోండి.. సోనూసూద్‌ను ఒత్తిడి చేసిందెవరు..?
- Samsung Galaxy Ring 2 న్యూ ఇయర్ లాంచింగ్.. AI ఫీచర్లు,IP69 రేటింగ్..
- మారుతీ ఎలక్ట్రిక్ కారు e-Vitara వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి అంటే..
- V6 DIGITAL 28.12.2024 EVENING EDITION
- ఢిల్లీని ముంచెత్తిన వానలు.. ఎల్లో అలర్ట్.. వందేళ్లలో ఇదే తొలిసారి..
- Bank Holidays: జనవరి 2025లో బ్యాంక్ హాలీడేస్.. ఆ తేదీల్లో బ్యాంకులు బంద్
Most Read News
- Kitchen Tips: బియ్యంలోకి పురుగులు ఎందుకు వస్తాయి.. ఎలా తరిమికొట్టాలో తెలుసా..
- మహిళ కానిస్టేబుల్‌ను కాపాడేందుకే ఇద్దరు దూకేశారు: ట్రిపుల్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ
- తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..
- Samsung Galaxy S25 Slim: స్పెషల్ కెమెరా డిజైన్‌తో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్
- రూ.11 వేల 650 కోట్ల అప్పు తీర్చిన వోడాఫోన్ గ్రూప్
- కష్టాలు వెండాడుతున్నాయా... అయితే ఈ స్తోత్రాన్ని రోజూ చదవండి..
- Good Health: తిన్నవి అరగడం లేదా.. ఈ ఫ్రూట్స్ తినండి ఇట్టే అరిగిపోతుంది.. మలబద్దకం ఉండదు..!
- బాహుబలి ప్రొడక్షన్ హౌజ్ తో నాగ చైతన్య భారీ బడ్జెట్ సినిమా.. జోనర్ అదేనా..?
- రాజమౌళి సినిమాలో మహేష్ కి విలన్ గా ప్రభాస్ ఫ్రెండ్.. !
- డిగ్రీలో ఇక కామన్ సిలబస్