
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ బ్రాండ్ 'ఫ్లై చికెన్' ఔట్లెట్ హైదరాబాద్లో ప్రారంభమైంది. సంస్థ ఇండియా సీఈఓ కుల్‌ప్రీత్ సాహ్ని మాట్లాడుతూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఫ్రైడ్ చికెన్ ప్రియుల మన్ననలు పొందినదని చెప్పారు. ఈ బ్రాండ్ తన ప్రత్యేకమైన క్రిస్పీ చికెన్, అంతర్జాతీయ స్థాయి మెనూ ద్వారా నగరంలో ఫ్రైడ్ చికెన్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లనుందని అన్నారు.
ఫ్లై చికెన్ స్కాండినేవియాలో ప్రారంభమైందన్నారు. నాణ్యత, అత్యుత్తమ రుచి, క్రంచీ టెక్స్చర్ తో ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకర్షించిందని సాహ్ని అన్నారు. ఫ్లై చికెన్ ప్రత్యేక వంటకాల్లో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ వీల్స్, జూసీ టెండర్స్, ఇండల్జెంట్ సూపర్ ఫ్లై శాండ్విచ్, హాట్ చికెన్ లోడెడ్ ఫ్రైస్ ఉంటాయి.