
డిగ్రీ పూర్తయిన అభ్యర్థులకు భద్రమైన కొలువుతో పాటు భరోసా ఇచ్చే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఎగ్జామ్‌తో ఫ్లయింగ్ డ్యూటీ, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల్లో ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటికి సెలెక్ట్ అయితే దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో ట్రైనింగ్ ఇస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్ గురించి ఈవారం తెలుసుకుందాం..
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2023వ సంవత్సరానికి ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్‌క్యాట్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కింద అవివాహిత పురుషులు, మహిళలు అప్లై చేసుకోవచ్చు. ఐఏఎఫ్ ఏటా రెండుసార్లు మే/జూన్, డిసెంబర్ నెలల్లో ఈ ఎగ్జామ్ ప్రకటన విడుదల చేస్తుంది. ఇందులో టెక్నికల్, నాన్‌టెక్నికల్ పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం రెండో బ్యాచ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనిద్వారా ఏఎఫ్‌సీఏటీ ఎంట్రీ, ఎన్‌సీసీ ఎంట్రీ, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటీరియాలజీ ఎంట్రీ చేపట్టనున్నారు.
ఖాళీలు: 317
బ్రాంచిల వారీగా పోస్టులు:
1. ఫ్లయింగ్-77
2. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)-129
3. గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)-111
విద్యార్హతలు: అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌లో ఈ ఎగ్జామ్ పాస్ కావాలి. రెండు సబ్జెక్ట్స్‌లో కనీసం 50 శాతం చొప్పున మార్కులు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2023 జనవరి 1 నాటికి ఫ్లై బ్రాంచ్ అభ్యర్థులకు 20 నుంచి 24 ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ అభ్యర్థులకు 20 నుంచి 26 ఏళ్లు మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.250
జీతం: రూ.56,100 నుంచి రూ.1,77,500.
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: 1 డిసెంబర్ 2021
చివరి తేదీ: 30 డిసెంబర్ 2021
ఎగ్జామ్సెంటర్స్: హైదరాబాద్, వరంగల్
కోర్సు ప్రారంభం: 2023 జనవరి నుంచి ప్రారంభమవుతుంది.
వెబ్సైట్: www.afcat.cdac.in
ఎగ్జామ్ ప్యాటర్న్: వంద మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. సెక్షన్ వైజ్ కట్ఆఫ్ ఉండదు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు తొలగిస్తారు.
ట్రైనింగ్: గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్‌కు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్‌కు 52 వారాల పాటు శిక్షణ ఇస్తారు.
జీతం: ఫ్లయింగ్ ఆఫీసర్‌కు లెవల్ 10 కింద నెలకు రూ.56,100 నుంచి 1,77,500, ఎంఎస్పీ రూ.15,500, ట్రైనింగ్ పీరియడ్‌లో రూ.56,500 స్టయిఫండ్ ఇస్తారు.