సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలి : స్కాడ్ ఆఫీసర్​ రమణ

జూలూరుపాడు, వెలుగు : మండల పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులో నిఘా పెంచాలని వైరా నియోజకవర్గ ఎన్నికల  ఫ్లయింగ్ స్కాడ్ ఆఫీసర్​ రమణ అధికారులకు సూచించారు.

బుధవారం మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీసులతో కలిసి వాహన తనిఖీలు చేసి పలు సూచనలు చేశారు. నగదు, మందు తరలించకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఆయన వెంట ఎస్సై జీవన్ రాజు ఉన్నారు.