ఇది గిటార్. విమానాన్ని పట్టుకుని గిటారంటారా.. మమ్మల్ని మోసం చేయలేరు అంటారా? అవును అది విమానమే.. అది గిటారే. ఇంకా అర్థం కాలేదా ఇది ‘గిటార్ విమానం’! పేరు ఫ్లయింగ్ వీ. నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్ఎం అనే ఎయిర్‌లైన్స్ కంపెనీ ఈ విమానాన్ని తయారు చేయిస్తోంది. ఇప్పటికే ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో విమానాల ఆకారాన్ని పూర్తిగా మార్చేసేలా ముందడుగు వేస్తున్నారట. మహామహులైన మ్యూజీషియన్స్ వాయించిన గిబ్సన్ ‘ఫ్లయింగ్ వీ’ అనే ఎలక్ట్రిక్ గిటార్ పేరునే పెట్టారు. డెల్ఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ కాన్సెప్ట్‌ను తయారు చేశారు. రెక్కల్లోనే ప్రయాణం చేసేలా వీ టైప్ రెక్కలుంటాయి. తోక అంటారా.. కోసి పడేశారు సైంటిస్టులు. మామూలు విమానాల కన్నా కూడా 20 శాతం తక్కువ ఇంధనాన్ని తాగుతుందట. ఈ విమానానికి రెక్కలపైన ఒక్కోటి చొప్పున రెండు ఇంజన్లుంటాయి. విమానం వెడల్పు 215 అడుగులైతే పొడవు కేవలం 180 అడుగులు. 314 మంది ప్రయాణించేలా దీనికి డిజైన్ చేశారు. లోపల సీటింగ్నూ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతమున్న ఎయిర్‌బస్ ఏ 350, బోయింగ్ 787 విమానాలకు ఇది గట్టి పోటీనిస్తుందని కేఎల్ఎం సంస్థ మంచి ధీమాతో ఉంది.