అనకాపల్లి హైవేపై ఫ్లైఓవర్ పిల్లర్ కూలి ఇద్దరు మృతి

అనకాపల్లి హైవేపై ఫ్లైఓవర్ పిల్లర్ కూలి ఇద్దరు మృతి

విశాఖపట్నం జిల్లాలో నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ- అనకాపల్లి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్ పిల్లర్లు కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది . ఓ కారు.. ఓ ట్యాంకర్ పై పిల్లర్లు పడటంతో.. అవి ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే  చనిపోయారు. ట్యాంకర్ డ్రైవర్ గాయపడ్డారు. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్దంతో కూలడంతో.. జనం భయంతో పరుగులు తీశారు. అనకాపల్లి డైట్ కాలేజీ దగ్గర ఈ సంఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు..ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. కూలిన బ్రిడ్జి దగ్గర సహాయక చర్యలు చేపట్టారు.