కొత్త ఏడాది 2025 వేడుకలకు హైదరాబాద్ సిటీ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈవెంట్స్ ఫిక్స్ అయిపోయాయి.. జనం కూడా గ్రాండ్ గా వెల్ కం చెప్పటానికి.. ఎవరికి తోచిన విధంగా వాళ్లు సెలబ్రేషన్స్ ప్లానింగ్ లో ఉన్నారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 2025, జనవరి ఒకటో తేదీ అర్థరాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటలకు హైదరాబాద్ సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నారు పోలీసులు. మద్యం మత్తులో కావొచ్చు.. ర్యాష్ డ్రైవింగ్ కావొచ్చు.. ఫ్లై ఓవర్లపై సెలబ్రేషన్స్ కావొచ్చు.. కారణం ఏదైనా సరే.. హైదరాబాద్ సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. తిరిగి జనవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు అన్నింటిని ఓపెన్ చేయనున్నారు.
ALSO READ | కుంభమేళా 2025: సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ ..IRCTC 8 రోజుల టూర్.. ప్యాకేజీ వివరాలు ఇవే
ఫ్లై ఓవర్లను డిసెంబర్ 31 అర్ధరాత్రి 2 గంటల వరకు మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం వేవలం పీవీ ఎక్స్ ప్రెస్ వే (PVNR Expressway) మాత్రం అందుబాటులో ఉంచుతారు. పాస్ పోర్ట్, ప్లైట్ టికెట్ చూపిస్తేనే అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు.
న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎక్స్ ప్రెస్ వే, ట్యాంక్ బండ్ మీదుగా వెహికిల్స్ కు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. ఫ్లై ఓవర్ల మూసివేతతో ఈ కింది మార్గాలలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది.
- ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్
- ఎన్టీఆర్ మార్గ్ మీదుగా బీఆర్ కే భవన్, తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, లక్డికాపూల్, అయోధ్య జంక్షన్
- లిబర్టీ జంక్షన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ఖైరతాబాద్ మార్కెట్, నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ (వినాయక జంక్షన్), సెంన్సేషన్ థియేటర్, రాజ్ దూత్ లానే
- నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి, సంజీవయ్య పార్కు, రాణిగంజ్ వైపు వెళ్లే పీవీ మార్గ్, మినిస్టర్ రోడ్, సెయిలింగ్ క్లబ్, కవాడిగూడ ఎక్స్ రోడ్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్
- సెక్రెటేరియట్ పక్కన ఉన్న మింట్ కంపౌండ్ రోడ్డు కూడా మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక న్యూ ఇయర్ కారణంగా సిటీలోకి భారీ వాహనాలకు అనుమతి లేదని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిత్యం పర్యవేక్షిస్తుంటారని, సహకరించాలని పోలీసులు కోరారు.