రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టం చేశారు. ఒడిశాకు ప్రత్యేక హోదాపై డిమాండ్ వస్తున్న నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో పర్యటించిన సీతారామన్ ఈ విధంగా స్పందించారు. భవిష్యత్ లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని గతంలోనే ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని ఆమె గుర్తు చేశారు.
ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో మహాత్మగాంధీ జాతీయఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులు తగ్గలేదని చెప్పారు. డిమాండ్ కు తగ్గట్టుగా నిధుల కేటాయింపులో సవరణలు చేస్తున్నామన్నారు.