Budget 2025: రూ.500కోట్లతో AI కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

Budget 2025: రూ.500కోట్లతో AI కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కోసం రూ. 500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా విద్యారంగంకోసం AI లక్ష్యంగా ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Also Read : బడ్జెట్లో బీహార్కు భారీ కేటాయింపులు..

2023లో వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర పట్టణాలకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) లో మూడు ఎక్సలెన్స్ సెంటర్లను ప్రకటించామని  సీతారామన్ హైలైట్ చేశారు. ఆర్థిక మంత్రి ఐదు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ తయారీ అవకాశాల కోసం అవసరమైన నైపుణ్యాలతో భారతీయ యువతను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

టెక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత్ పాత్రను దృష్టిలో ఉంచుకొని దాదాపు 6500 మంది అదనపు విద్యార్థులకు ఐఐటీలలో మౌలిక సదుపాయాలు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.