
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం సహా పలు ప్రాంతాల్లో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి ఫ్యాషన్ రిటైలర్ సీఎంఆర్ రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. సీఎంఆర్ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ చెక్కును, జ్ఞాపికను సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా అందజేశారు. సీఎం నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది.