న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్‌లో వోలాటాలిటీ పెరగొచ్చు. ఫెడ్ మీటింగ్, యూనియన్ బడ్జెట్, కంపెనీల క్యూ3 రిజల్ట్స్ మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ల కదలికలపై పోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.64,156 కోట్ల విలువైన షేర్లను ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మారు. ‘ఫిబ్రవరి 1 న కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై అందరి కళ్లున్నాయి.
మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చే అంశాలు బడ్జెట్‌లో ఉంటాయో? లేదో? చూడాలి. ఇప్పటివరకు విడుదలైన క్యూ3 ఫలితాలు పెద్దగా మెప్పించలేదు. ముఖ్యంగా వినియోగం, ఫైన్షాయల్ కంపెనీల ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గ్లోబల్‌గా చూస్తే, ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) పాలసీ మీటింగ్ వివరాలు ఈ నెల 30న వెలువడనున్నాయి’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ ఎనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరపై ట్రేడర్లు దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు.