ముంబై: వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా.. గురువారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌పై దృష్టి పెట్టింది. దీంతో మంగళవారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎక్కువగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంపై ఫోకస్ పెట్టాడు. టోర్నీలో వరుసగా షార్ట్ బాల్స్‌కు ఔటైన నేపథ్యంలో తన బలహీనత సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. రెండు గంటల పాటు జరిగిన సెషన్‌లో శ్రేయస్ మొదట లోకల్ నెట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.
తర్వాత త్రోడౌన్స్ స్పెషలిస్ట్‌లు రాఘవేంద్ర, లెఫ్టార్మర్ నువాన్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ విసిరిన షార్ట్ బాల్స్‌ను దీటుగా ఆడాడు. బలమైన షాట్లతో బాల్‌ను స్టాండ్స్, రోప్ దాటించాడు. చివర్లో ద్రవిడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా అయ్యర్‌కు త్రోడౌన్స్ వేశారు. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, గిల్ తోపాటు పేసర్లు ఈ ఆప్షనల్ సెషన్‌కు రాలేదు. మరోవైపు గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ముంబై చేరి టీమ్‌తో కలిసే చాన్స్ ఉంది.