పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలి : గుండు సుధారాణి

పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలి : గుండు సుధారాణి

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు : వంద శాతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి బల్దియా ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం జీడబ్ల్యూఎంసీ ఆఫీస్​లో నిర్వహించిన సమావేశంలో మేయర్ సర్కిళ్లు, వార్డుల వారీగా పన్నుల సేకరణ, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిపై ఆరా తీశారు.

2024--–25లో రూ.114 కోట్ల 44 లక్షల పన్ను వసూలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ.42 కోట్ల 59 లక్షలు వసూలు చేశారని, ప్రణాళికా బద్ధంగా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే 93 శాతం పూర్తయిందని, పెండింగ్ కూడా కంప్లీట్​ చేయాలన్నారు. అదనవు కమిషనర్ జోనా, ఉప కమిషనర్లు కృష్ణారెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.