కర్ణాటక ఎన్నికలు కాగానే తెలంగాణపై ఫోకస్.. : జైరాం రమేశ్

కర్ణాటక ఎన్నికలు కాగానే తెలంగాణపై ఫోకస్.. : జైరాం రమేశ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 130 సీట్లకు పైగా గెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. కన్నడనాట తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవసరం రాబోదని అన్నారు. ప్రధాని మోడీ అసమర్థత పాలనతో దేశం విసిగిపోయిందని విమర్శించారు. 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని కన్నడ ప్రజలు నిర్ణయించున్నారని పేర్కొన్నారు. 

మా నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ..

తెలంగాణలో కాంగ్రెస్ నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తీసుకుంటారని జైరాం రమేశ్ తెలిపారు. కర్ణాటక ఎన్నికలు కాగానే తమ తదుపరి టార్గెట్ తెలంగాణే అని స్పష్టం చేశారు.