ఓపెనర్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నేడు విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీమిండియా నాలుగో టీ20

ఓపెనర్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నేడు విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీమిండియా నాలుగో టీ20

లాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ):  వరుసగా రెండు ఓటముల తర్వాత మూడో పోరులో ఘన విజయంతో ఐదు టీ20ల   సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రేసులోకి వచ్చిన టీమిండియా.. అగ్రరాజ్యం అమెరికా గడ్డపై వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కీలక పోరుకు రెడీ అయింది. శనివారం జరిగే నాలుగో టీ20లో గెలిచి 2–2తో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సమం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. వరుస వైఫల్యాల తర్వాత గత పోరులో సూర్య కుమార్ ఎట్టకేలకు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకోవడం, యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ సత్తా చాటడంతో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గెలుపు రుచి చూసినప్పటికీ ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతోంది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో  ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరాశ పరిచారు.  గత పోరులో ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో  ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన అరంగేట్రం ఆటగాడు  

యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైతం ఆకట్టుకోలేకపోయాడు. ఓపెనర్లిద్దరూ ఆరంభంలోనే ఔటవడంతో టీమిండియా ఒత్తిడిలో పడిపోతోంది. ఈసారైనా ఓపెనర్లు ఇండియాకు మంచి ఆరంభం ఇవ్వాలని కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరుకుంటోంది. ముఖ్యంగా మూడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిట్లకే ఔటైన శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన స్థాయికి తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంది.  వరుసగా మూడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ మెప్పించిన తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మతో పాటు గత మ్యాచ్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగిస్తే టీమ్​కు తిరుగుండదు. మూడో టీ20లో ఓడినా ప్రస్తుతానికి 2–1తో ఆధిక్యంలో ఉన్న వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకోవాలని చూస్తోంది.

2016 తర్వాత టీమిండియాపై తొలి టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచే అవకాశాన్ని చేజార్చుకోకూడదన్న కృతనిశ్చయంతో ఉంది. ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిట్టర్లు పూరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. హెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకుంటే ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలం మరింత పెరగనుంది. ఇక, లాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిల్స్​ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలించనుంది.   ఇక్కడ జరిగిన 13 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచింది. అయితే, శనివారం మ్యాచ్​ టైమ్​లో వర్ష సూచన ఉంది.  ఈ నేపథ్యంలో టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గి జట్టు ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మొగ్గు చూపొచ్చు.