డిజిటల్ ఎడ్యుకేషన్​పై ఫోకస్​ పెట్టాలి.. డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ కాలేజీ యాజమాన్యం

డిజిటల్ ఎడ్యుకేషన్​పై ఫోకస్​ పెట్టాలి.. డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ కాలేజీ యాజమాన్యం

ముషీరాబాద్, వెలుగు: విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చదువును కొనసాగించాలని కాకా డాక్టర్​బీఆర్ అంబేద్కర్​కాలేజీ యాజమాన్యం సూచించింది. డిజిటల్ విద్యపై దృష్టి సారించాలని చెప్పింది.  బాగ్ లింగంపల్లిలోని విద్యాసంస్థల ఆవరణలో ఎంబీఏ విద్యార్థులకు ఉద్యోగ సంపాదన.. ఉద్యోగంలో ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలపై సదస్సు జరిగింది. 

కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మీసాల అప్పలయ్య మాట్లాడుతూ.. బోధన పద్ధతుల్లో వస్తున్న మార్పులను గ్రహించి ముందుకు సాగాలన్నారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.