ODI World Cup 2023: సునామీలా వచ్చిన మంచు.. మీమ్స్ తో చెలరేగిన క్రికెట్ ఫ్యాన్స్

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న(అక్టోబర్ 22) భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో టీమిండియా 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో పెద్దగా చెప్పకోవడానికి ఏమీ లేకపోయినా ఆసక్తికర సంఘటన ఒకటి చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 273 పరుగులను ఛేదించే క్రమంలో భారత్ స్కోరు 100/2 వద్ద ఉండగా ఆటకు అంతరాయం ఏర్పడింది. 

ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచులో భారత ఇన్నింగ్స్ 16 ఓవర్లో దట్టమైన పొగమంచు రావడంతో ఏమీ కనబడలేదు. దీంతో అంపైర్లు కాసేపు ఆటను నిలిపివేశారు. విరాట్ కోహ్లీ 7 పరుగులతో, శ్రేయాస్ అయ్యర్ 21 పరుగులతో క్రీజులో ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కాసేపటికే అంతా సెట్ అవ్వడంతో మ్యాచ్ ను యధాతధంగా కొనసాగించారు. ఇదిలా ఉండగా..  ప్రస్తుతం ఈ పొగమంచుపై నెటిజన్స్ మీమ్స్ తో చెలరేగుతూ నవ్వులు పూయిస్తున్నారు. 

డెంగ్యూ బారిన పడిన గిల్ దోమలపై ప్రతీకారామ్ తీర్చుకుంటున్నాడంటూ కొంతమంది మీమ్ చేస్తే.. మ్యాచ్ ఆపడం కోసం పాక్ ఈ కుట్ర ఏమైనా జరిపిందా అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక WWW స్టార్ అండర్ టేకర్ ఎంట్రీ ఇస్తున్నాడా ఏంటి ? అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. మొత్తానికి పొగ మంచు మీమర్స్ కి మంచి కిక్ ఇచ్చింది. 

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ వీరోచిత సెంచరీ(130) కి తోడు రచీన్ రవీంద్ర 75 పరుగులు చేసాడు. భారత బౌలర్లలో షమీకి 5 వికెట్లు దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో భారత్ 6 వికెట్లను కోల్పోయి ఛేజ్ చేసింది. విరాట్ కోహ్లీ 95 పరుగులతో భారత్ కు విజయాన్ని అందించగా.. రోహిత్(46), జడేజా(39) రాణించారు.        

ALSO READ :వెయ్యేండ్ల నాటి భువనగిరి కోట ..ఓసారి చూసోద్దామా