ఫోల్డబుల్ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లకు ఎంతో ఆదరణ

ఫోల్డబుల్ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లకు ఎంతో ఆదరణ
  •  శామ్​సంగ్​ మొబైల్ బిజినెస్ హెడ్ టి.ఎం. రోహ్

గురుగ్రామ్: ఇండియాలో ఫోల్డబుల్ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు విపరీత ఆదరణ కనిపిస్తోందని  శామ్​సంగ్ తెలిపింది. ఎక్కువ మంది ప్రీమియం స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని, వీటిలో ఫోల్డబుల్స్ ఫోన్లూ ఉన్నాయని కంపెనీ మొబైల్ బిజినెస్ హెడ్ టిఎం రోహ్ అన్నారు. “ఫోల్డబుల్స్ విపరీతంగా పెరుగుతున్న మార్కెట్లలో భారతీయ మార్కెట్ ఒకటి. ఈ వృద్ధిలో అత్యంత కీలకమైన గెలాక్సీ ఫోల్డబుల్స్ ఉన్నాయి.

 ఈ సంవత్సరం మార్కెట్ డిమాండ్ పెరుగుతుందని మేం అంచనా వేస్తున్నాం.  కస్టమర్లు కొత్త గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6ని బాగా ఆదరించారు. జెడ్​ సిరీస్​లోని ఏఐ ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి”అని చెప్పారు.  ఈ ఏడాది చివరి నాటికి 200 మిలియన్ల గెలాక్సీ పరికరాల్లో గెలాక్సీ ఏఐని చేర్చాలని యోచిస్తున్నామని రోహ్ వివరించారు.