పెళ్లి చేసి చూడాలి.. ఇల్లు కట్టి చూడాలి’.. ఇది ఎప్పటి నుంచో ఉన్న సామెత. మనిషి జీవితంలో పెళ్లికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇంటికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందనేది ఈ సామెత అర్థం. అందుకే పెళ్లి విషయంలోనూ, ఇంటి నిర్మాణం విషయంలోనూ అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే ఇంటి నిర్మాణంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ బిల్డింగ్‌ల నుంచి డూప్లెక్స్‌ల వరకు ఇళ్ల నిర్మాణంలో మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. ఇక ఓ అడుగు ముందుకేసి మడతపెట్టే ఇళ్లు కూడా వచ్చేశాయ్. ఇప్పుడు అమెరికాలో హోల్డి్ంగ్ హౌస్( మడతపెట్టే ఇళ్లను) అమెజాన్ లో అమ్ముతున్నారు.
ఈ ఇంటిని ఎంచక్కా మడతపెట్టేసి నచ్చిన చోటుకి తీసుకెళ్లిపోవచ్చు. మడత పెట్టే ఇళ్లు అంటే అదేదో సాధారణంగా ఉంటుందనుకోకండి.. ఇంటి లోపల లగ్జరీగా ఉంటుంది. తాజాగా ఈ ఫోల్డబుల్ ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. . ఈ ఫోల్డబుల్ హౌస్‌ను23 ఏళ్ల టిక్‌టాకర్ అమెజాన్ నుంచి కొనుగోలు చేశారు. లాస్ ఏంజల్స్ కు చెందిన జెఫ్రీ బ్రయంట్ టిక్‌టాక్‌లో పోస్టు చేసిన తరువాత ఈ వీడియో వైరల్‌గా మారింది…
ఈ చిన్న ఫ్లాట్లో షవర్, టాయిలెట్, కిచెన్, లివింగ్ ఏరియా మరియు బెడ్రూమ్ ఉన్నాయి. ఈ ఇంటి ధర రూ. 21 లక్షలకు అమెజాన్ లో జెఫ్రీ బ్రయంట్ కొనుగోలు చేశారు. 16.5 అడుగుల పొడవు, 20 అడుగుల పొడవున్న ఇల్లు ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పెరుగుతున్న అద్దెలు, అడ్వాన్సులకు ప్రత్యామ్నాయంగా చాలా మంది ఇలాంటి చిన్న ఇళ్లను ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు.. ఈ ఇంటి వీడియో వైరల్ కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఇంటిని అన్‌ఫోల్ట్ చేస్తున్న వీడియోను . అయితే భారత్‌లో ఈ నిర్మాణ ఖర్చు మరింత తగ్గే అవకాశాలు ఉంటాయి. విపత్తులు జరిగిన చోట త్వరగా షెల్టర్‌ల ఏర్పాటుకు ఇది సరిగ్గా సరిపోతుంది
Amazon sells these houses for $19,000 because no one can afford a real home anymore. They are glorified shipping containers. pic.twitter.com/4mLJF2HaJx
— Ian Miles Cheong (@stillgray) February 5, 2024