
అసోంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ ప్రభుత్వం బాథౌయిజాన్ని అధికారిక జానపద మతంగా గుర్తించింది. ఇది బోడో ప్రజల జానపద మతం. ఈ తెగ ప్రజలు బాతౌబ్రాయ్ లేదా సిబ్రాయ్ను సర్వోన్నత దేవుడిగా ఆరాధిస్తారు. అందుకే దీనిని బాథౌమతం అ ని పిలుస్తారు.
బోడో భాషలో బా అంటే ఐదు థౌ అంటే తాత్విక చింతన అని అర్థం. ఈ మతంలో ఉన్న ఐదు ప్రధాన అంశాలు బార్(గాలి), శాన్(సూర్యుడు), హా(భూమి), ఓర్(అగ్ని), ఓఖ్రాంగ్(ఆకాశం).
బోడో తెగ
- అసోంలో అతిపెద్ద స్థానిక మైదాన తెగ.
- మాతృభూమి బ్రహ్మపుత్ర నది ఉత్తరాన ఒడ్డున భూటాన్ పర్వత ప్రాంతాలలో ఉన్నది.
- వీళ్లు టిబెట్, బర్మన్ మాట్లాడే అసోం, బర్మా సమూహానికి చెందినవారు.
- టిబెట్, బర్మ భాష భారత రాజ్యాంగంలో 22వ షెడ్యూల్డ్ భాషల్లో ఒకటిగా గుర్తించారు.