కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం పాటించండి

  • బీసీ నేత జాజుల డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయాన్ని పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో మీడియాతో జాజుల మాట్లాడారు. అర శాతం, ఐదు శాతం ఉన్నవారికి 60 శాతం పదవులు కట్టబెట్టి, 90 శాతం ఉన్నవారికి 20 శాతం రాజకీయ పదవులు కట్టబెట్టడం సామాజిక న్యాయం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

తొమ్మిది శాతమున్న అగ్రకులాల నుంచి సీఎంతో సహా ఏడుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. బీసీలు 60 శాతం ఉంటే రెండు మంత్రి పదవులు, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒకటే ఇచ్చారన్నారు. కేబినెట్​లో యాదవ్, గొల్ల కురుమలు, విశ్వ బ్రాహ్మణులు, రజక, ముదిరాజ్,  లంబాడాలు, మైనారిటీ వర్గాల నుంచి మంత్రులు లేరని జాజుల గుర్తు చేశారు.