చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ అనుచరులు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. జైపుర్ మండలం షెట్ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ ZPTC, బాల్క సుమన్ అనుచరుడు మేడి సంపత్ ఇంటికి వచ్చి మరీ కొట్టారని ఆరోపిస్తున్నారు బాధితులు. కులం పేరుతో దూషిస్తూ.. భూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు.