లింగంపేట, వెలుగు : ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అనుచరులు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ను వీడుతుండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. మాజీ ఎమ్మెల్యే సురేందర్ ప్రధాన అనుచరులు వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. శనివారం లింగంపేట మాజీ ఎంపీపీ వడ్ల భీమయ్య, ఎల్లారెడ్డి మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ గజవాడ నరహరి, మాజీ జడ్పీటీసీ కొడుకు కమ్మరి వెంకటేశం
నాగిరెడ్డిపేట మండల సీనియర్ లీడర్ రాజ్‌మోహన్‌రెడ్డి కారు దిగి కమలం పార్టీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్సమక్షంలో వీరు బీజేపీలో చేరారు. నాలుగు రోజుల క్రితం ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం,తాడ్వాయి ఎంపీపీ కొండి రవి, ఆయా మండలాల ఎంపీపీలు,జడ్పీటీసీమెంబర్లు,సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.