పువ్వాడ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నడు
అందుకే ఏమేమో మాట్లాడుతున్నాడు
మంత్రి అజయ్‌పై పొంగులేటి అనుచరుల ఫైర్
ఖమ్మం : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్అనుచరులు మంత్రి పువ్వాడ అజయ్‌పై ఫైర్అయ్యారు. ఖమ్మంలోని శ్రీనివాస రెడ్డి క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మువ్వా విజయ్ బాబు, స్వర్ణకుమారి, నగేశ్ యాదవ్ మాట్లాడారు. పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం చూసి పువ్వాడకు పూనకం వచ్చిందని, ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఏమేమో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పొంగులేటి అడగడం వల్లే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయని తెలిపారు. కొత్త బస్టాండ్ నిర్మాణ వ్యయాలేంటి?, గోళ్లపాడు ఛానల్ ద్వారా పువ్వాడ దండుకున్నదెంత? అందరికీ తెలుసన్నారు.
బైరటీస్ అక్రమ వ్యవహారంపై త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. డీసీసీబీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అన్నింటికి లెక్కలున్నాయని వెల్లడించారు. ఈ విషయమై అష్టలక్ష్మీ గుడి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధం.. నీవు రెడీ అంటూ పువ్వాడకు సవాల్ విసిరారు. పార్టీ ఆఫీసులో నీ ఫొటో తీసేశారని, మొదట నీ పక్కన ఉన్న కట్టప్పల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నీ ఓటమి తప్పదు గుర్తుంచుకో అంటూ అజయ్‌పై ఫైర్ అయ్యారు.