ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులు

పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయమే లక్ష్యంగా ఓటర్లు మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు పంపిణీకి పూనుకున్నారు.జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులు ఓట్లు రాబట్టుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.

బుగ్గారం బస్టాండ్ సమీపంలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా రెడ్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ నాయకులు పట్టుకున్నారు.ఒక్కో ఓటరుకు 5 వేలు పంచుతున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు,కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.అధికార పార్టీ లీడర్లు అర్థరాత్రి పంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పట్టుకునేందుకు అలర్ట్ గా ఉన్నారు.