కోల్ బెల్ట్:చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కి మంత్రి పదవి రావాలంటూ కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆలయంలో పూజలు చేశారు. ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ లోని జగదాంబస్వరా ఆశ్రమంలో అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి పదవిలో ఉంటే ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తారని, అన్ని వర్గాలను ఆదుకుంటారని సదానందం అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం వెంటనే వివేక్ వెంకటస్వామి కి మంత్రి పదవి ప్రకటించాలని కోరారు.