ఎక్కడికక్కడ బీఆర్ఎస్​ లీడర్ల అరెస్ట్

మెదక్, వెలుగు: బీఆర్ఎస్​పార్టీ చలో హైదరాబాద్​పిలుపు నిచ్చిన నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని ఆ పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ ఆరెస్ట్​ చేశారు. మెదక్ టౌన్​ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్ జయరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 హవేలి ఘన్​పూర్, మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు జయరాం రెడ్డి, నాయకులు సాప సాయిలు, ఆంజనేయులు, ప్రభాకర్, ఎలక్షన్ రెడ్డి, నవీన్, శ్రీనివాస్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. నిజాంపేట, కొల్చారం, చిన్నశంకరంపేట తదితర మండలాల్లో బీఆర్ఎస్​ నాయకులను అరెస్ట్​ చేశారు. 

బీఆర్ఎస్​ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డిని హైదారబాద్​ కొంపల్లిలోని ఆమె ఇంటిలో హౌజ్​అరెస్ట్​ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమన్నారు.