వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు సాధిస్తున్న విజయాలను పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఓర్వలేకపోతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తమ వక్రబుద్ధిని బయటపెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం భారత బౌలర్లు ప్రత్యేక బంతులతో బౌలింగ్ చేస్తున్నారని ఆరోపించిన మేధావి వర్గం.. ఇప్పుడు మరో కొత్త వాదనతో మీడియా ముందుకు వచ్చారు.
టాస్ వేసే సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కుట్ర పన్నుతాడని ఆరోపించిన పాక్ మాజీ ఆటగాళ్లు సికందర్ భక్త్, ఆకిబ్ జావేద్.. ఫలితాలను బట్టి చూస్తుంటే ప్రపంచ కప్ ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు అనిపిస్తోందని మాట్లాడారు.
పాకిస్థాన్ కు చెందిన ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సికందర్ భక్త్.. రోహిత్ శర్మపై సంచలన ఆరోపణలు చేశాడు. టాస్ సమయంలో హిట్‌మ్యాన్ కుట్ర పన్నుతున్నాడని ఆరోపించాడు. టాస్ వేసే సమయంలో రోహిత్ కాయిన్ ను దూరంగా విసిరేస్తున్నాడని.. దాంతో ఇతర జట్ల కెప్టెన్లకు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని మాట్లాడాడు. ఆ సమయంలో అక్కడ ఉంటున్న మ్యాచ్ రిఫరీలు(ఐసీసీ అధికారులు) ప్రత్యర్థి జట్టు కెప్టెన్ టెయిల్స్ చెబితే హెడ్స్ అని, హెడ్స్ చెబితే టెయిల్స్ అని చెప్తున్నారని ఆరోపించాడు.
Former Pakistan bowler Sikandar Bakht indicates India captain Rohit Sharma throws the coin far away at the toss so the opposition captain doesn't see it and he gets the decision in his favour ??♂️??♂️
— Farid Khan (@_FaridKhan) November 15, 2023
A new controversy ? #CWC23 #INDvsNZpic.twitter.com/zdzd3Zwrc7
ఇక ఆకిబ్ జావేద్ అయితే.. ప్రత్యర్థి కెప్టెన్ నాణెం వైపు చూడనప్పుడు టాస్ వేయడం ఎందుకు అని మండిపడ్డాడు. బీసీసీఐ క్రికెట్‌ను నియంత్రిస్తున్నా.. చర్యలు తీసుకోవడానికి ఐసీసీ వెనుకాడుతోందని ఆరోపించాడు. "ఈ ప్రపంచకప్ ప్లాన్ చేయబడింది.. భారత జట్టే గెలుస్తుంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లోనూ బీసీసీఐ టాస్ విషయంలో రిగ్గింగ్ చేసింది. అందువల్లే శ్రీలంకపై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.." అని ఈ మాజీ క్రికెటర్ ఆరోపించాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'Rohit Sharma throws the coin and does not flip it properly! What's the point of toss when opposition captain doesn't see the side of coin? BCCI is controlling cricket and ICC does not speak in front of them. This World Cup is planned, India will win it and India's win in 2011… pic.twitter.com/cn9zNxZids
— Farid Khan (@_FaridKhan) November 16, 2023
కాగా, వాంఖడే వేదికగా బుధవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత జట్టు సెమీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ICC should immediately merge into the BCCI. Threw coin far away & match referee didn't even see the coin! cheaters doing what they want. pitch fixing ,toss fixing and buying umpires to win this wc.#Pitch #viratkohli #CWC23 #cwc2023 #ICCWorldCup #BabarAzam #INDvsNZ #cheating pic.twitter.com/0fSmUTvwto
— Arslan Malik (@ArsalMalik32714) November 15, 2023