ఫుడ్​ అండ్​ అగ్రికల్చర్​ ఆర్గనైజేషన్​ రిపోర్ట్​

ఫుడ్​ అండ్​ అగ్రికల్చర్​ ఆర్గనైజేషన్​ రిపోర్ట్​

2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్​ అండ్​ అగ్రికల్చర్​ ఆర్గనైజేషన్​ (ఎఫ్​ఏఓ) విడుదల చేసిన స్టేట్​ ఆఫ్​ ఫుడ్​ అండ్​ అగ్రికల్చర్​ నివేదికలో పేర్కొంది. 
    అటవీ శాతం పెరిగిన తొలి 10 దేశాల్లో మొదటి, రెండు స్థానాల్లో చైనా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. మూడో స్థానంలో భారత్​ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చిలీ, వియత్నాం, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్​, ఇటలీ, రొమేనియా ఉన్నాయి. 
    చైనాలో 19,37,000 హెక్టార్ల మేరకు అటవీ విస్తీర్ణం పెరిగినట్లు రిపోర్టు తెలిపింది. ఆస్ట్రేలియాలో 4,46,000 హెక్టార్ల మేరకు అటవీ ప్రాంతం పెరిగింది. 
    భారతదేశంలో నిర్వీర్యం అవుతున్న నేలల్లో ఇన్నోవేటివ్​ పద్ధతుల ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచుతున్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. చాలా వరకు దేశాల్లో అటవీ నిర్మూలన తగ్గినట్లు ఈ రిపోర్టు తెలిపింది.