
- సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్
హైదరాబాద్, వెలుగు: ఫేస్‌బుక్, ఎక్స్(ట్విట్టర్)లో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అసత్య పోస్టులు వైరల్ అవుతున్నాయని బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఎ.ఫహీం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు స్క్రైబ్, హాక్ మీడియా హౌస్ వంటి పేర్లతో ఫేస్‌బుక్, ఎక్స్‌లో చేస్తున్న పోస్టులను తన ఫిర్యాదులో ప్రస్తావించారు. కొందరు ఫేక్ లెటర్‌హెడ్‌లను ఉపయోగించి తనపై అసత్య ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని, వారిపై వెంటనే యాక్షన్తీసుకోవాలని కోరారు.
ఫుడ్కార్పొరేషన్చైర్మన్హైడ్రా పేరుతో భయపెట్టి రూ. కోట్లు డిమాండ్ చేస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని అమీన్ పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఒక లెటర్సీఎం రేవంత్ రెడ్డికి గత నెల 10వ తేదీన ఫిర్యాదు చేసినట్టు సర్క్యులేట్అవుతోంది. అందులో తనకు డబ్బులు ఇవ్వకపోతే హైడ్రా వస్తుందని, కూల్చివేతలు ఉంటాయని బెదిరించారని ఫిర్యాదు చేసినట్టు ఉంది. తన వెనక సీఎం ఉన్నారని చెప్తున్నాడని, వసూలు చేసిన డబ్బులు సీఎం, ఇతర మంత్రులకు ఇవ్వాలని చెప్తున్నాడని పేర్కొనట్టు ఉంది.
స్పందించిన హైడ్రా చీఫ్ రంగనాథ్
కంప్లయింట్చేసినట్టులెటర్సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఫహీమ్కూడా హైడ్రా కమిషనర్రంగనాథ్కు కాల్చేసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని కోరడంతో రంగనాథ్స్పందించారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపడతామని, అసలు వాస్తవాలను ఒకటి, రెండు రోజుల్లో బయటపెడతామని తెలిపారు.