డెలవరీ ఛార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ : రోజుకు కోటి రూపాయల బాదుడు

డెలవరీ ఛార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ : రోజుకు కోటి రూపాయల బాదుడు

ఇంటింటికీ సేవలు.. అలా క్లిక్ చేయగానే ఇలా డెలివరీ చేస్తుంది.. బయట వర్షం అయినా.. తుఫాన్ అయినా.. ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టకుండా ఏం కావాలంటే ఆ ఫుడ్ నిమిషాల్లోనే వచ్చేస్తుంది.. బాగుందని అందరూ అలవాటు పడ్డారు.. ఇప్పుడు బాదుడు మొదలైంది.. ఒకరి బాటలో ఒకరు అన్నట్లు.. అన్ని డెలివరీ యాప్స్ తమ ఫ్లాట్ ఫాం ఛార్జీలు పెంచేశాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. పెంచిన ఛార్జీలతో రోజువారీగా కస్టమర్లపై ఎంత వసూలు చేస్తున్నారో తెలుసుకుందామా...

జొమాటో, స్విగ్గీ మరోసారి ప్లాట్ఫార్మ్ చార్జీలు పెంచాయి. గత రూ.5 గా ఉన్న ఈ చార్జీలను 20శాతం మేర పెంచేశాయి ఈ లీడింగ్ ఫుడ్ డెలివరీ యాప్స్. అంటే, ఒక్కో ఆర్డర్ కి డెలివరీ చార్జెస్ తో పాటు అదనంగా 6రూపాయల ప్లాట్ఫార్మ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు జీఎస్టీ, హ్యాండ్లింగ్ చార్జెస్, రెస్టారెంట్ చార్జెస్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరుకు మాత్రమే పరిమితమైన ప్లాట్ఫార్మ్ ఫీజు పెంపు త్వరలోనే అన్ని నాగరాలకీ వర్తించనుందని తెలుస్తోంది.

ALSO READ ; టీసీఎస్‌‌‌‌ ఉద్యోగులంతా ఆఫీసులకే

మనం చెల్లించే ఈ ప్లాట్ఫార్మ్ ఫీజు డైరెక్టుగా సదరు సంస్థలకే వెళ్తుంది. తమపై పడుతున్న ఖర్చుల భారాన్ని తగ్గించుకోవటం కోసమే ఈ ప్లాన్ వేశాయి జొమాటో, స్విగ్గీ సంస్థలు. గత సంవత్సరం 2రూపాయలతో ప్రారంభించిన ఈ ప్లాట్ఫార్మ్ ఫీజును దశలవారీగా పెంచుతున్నాయి.ఈ చార్జీల పెంపు ద్వారా జొమాటో, స్విగ్గీ సంస్థలు రోజుకు 1 కోటి 25లక్షల నుండి 1 కోటి 50లక్షల వరకు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.