తగ్గిన స్విగ్గీ నష్టం.. ఆ రేంజ్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు మరి..!

తగ్గిన స్విగ్గీ నష్టం.. ఆ రేంజ్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు మరి..!

న్యూఢిల్లీ: ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ స్విగ్గీకి సెప్టెంబరుతో ముగిసిన రెండవ క్వార్టర్​లో కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన నష్టం రూ. 657 కోట్ల నుంచి రూ.625.53 కోట్లకు తగ్గింది. కంపెనీ గత నెలలో పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన తర్వాత తొలిసారిగా తన క్వార్టర్లీ ఫలితాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించింది. జులై-సెప్టెంబర్ క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా స్విగ్గీ ఆదాయం రూ. 3,601.45 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,763.33 కోట్లుగా ఉంది. ఈ  క్వార్టర్​లో దాని మొత్తం ఖర్చులు కూడా రూ.4,309.54 కోట్లకు పెరిగాయి.