
Quick Commerce: కరోనా సమయం నుంచి బాగా పాపులర్ అయిన వాటిలో ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీలు కూడా ఒకటి. అయితే ఇటీవలి కాలంలో ఈ కంపెనీలు క్విక్ కామర్స్ రంగంలోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. కిరాణా సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అనేక వస్తువులను సదరు సంస్థలు నిమిషాల వ్యవధిలోనే ఇంటికి డెలివరీ చేస్తూ తమ వ్యాపారాలను విస్తరిస్తూ పోతున్నాయి. ఈ క్రమంలో వీటితో జెప్టో, టాటా బిగ్ బాస్కెట్ వంటి ఇతర ఆటగాళ్లు కూడా పోటీలో ఉన్నారు. కానీ మార్కెట్లు ప్రస్తుతం రికవరీ మోడ్ కొనసాగిస్తున్న సమయంలో స్టాక్స్ ఎందుకిలా తిరోగమనాన్ని చూస్తున్నాయో పెట్టుబడిదారులకు అంతుపట్టడం లేదు.
ALSO READ | ఆన్‌లైన్ యాడ్స్‌పై తొలగనున్న డిజిటల్ ట్యాక్స్
వాస్తవానికి నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు పతనాన్ని నమోదు చేయటానికి ఒక కీలక కారణం ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ రేటింగ్ కంపెనీ మ్యాక్విర్ చేసిన ఒక ప్రకటనగా తెలుస్తోంది. పెట్టుబడిదారులు క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ అగ్రిగేటింగ్ వ్యాపారంలో ఉన్న కంపెనీలతో జాగ్రత్తగా వ్యవహరించాలంటూ రెడ్ ఫ్లాగ్ ఊపటంతో ఆందోళనలు స్టార్ట్ అయ్యాయి. ఇదే క్రమంలో సదరు రేటింగ్ సంస్థ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీలను నిర్వహిస్తున్న వెస్ట్ లైఫ్, దేవయానీ వంటి సంస్థలకు పాజిటివ్ రేటింగ్ అందించింది. ఈ రెండు కంపెనీలు వాస్తవానికి కేఎఫ్సీ, పిజ్జా హట్, మెక్డోవెల్స్ వంటి విదేశీ సంస్థలను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాయి.
వాస్తవానికి ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్న జొమాటో స్విగ్గీ కంటే ఎక్కువగా ఇంట్రాడేలో నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి కంపెనీ బ్లింకిట్, హైపర్ లూప్, మూవీ టికెటింగ్ వంటి ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్కెట్ల ముగింపు సమయంలో జొమాటో షేర్లు ఎన్ఎస్ఈలో ఒక్కోటి 6 శాతం నష్టంతో రూ.209.53 వద్ద తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అలాగే మరో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ అయిన స్విగ్గీ 4.7 శాతం నష్టంతో రూ.335 వద్ద తన ప్రయాణాన్ని క్లోజ్ చేసింది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.