సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో .. 157 వారాలుగా అన్నదానం 

ఆదిలాబాద్, వెలుగు : సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం పేదల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 157 వారాలుగా సాగుతున్న ఈ కార్యక్రమం ఆదివారం ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేయగా, జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది మేకల మధుకర్, న్యాయవాదులు చోలే దేవేందర్, సంతోష్, స్వామి, ప్రశాంత్ తదితరులు అన్నదానం చేశారు.

అనంతరం ట్రస్ట్ సభ్యుడు సుధీర్ కుమార్ సంగెంను వారు అభినంధించారు.