
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్ వంశీకృష్ణారెడ్డి స్మారకార్థం ఆదివారం అన్నదానం నిర్వహించారు. తోడే పద్మారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న అమ్మఒడి ఎన్జీవో అన్నదాన కార్యక్రమాన్ని బ్రాంచి మేనేజర్ పీక లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ నాయకుడు మేరుగు రామకృష్ణ, అమ్మఒడి అన్నదాన ప్రాజెక్టు సభ్యులు లెంకల సన్ని యాదవ్ ప్రారంభించారు.
కార్యక్రమంలో అమ్మఒడి ఎన్జీవో సభ్యులు బుకాల రంజిత్ కుమార్, గడ్డం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.