ఖిలావరంగల్(కరీమాబాద్), వెలుగు : ఎస్ఆర్ఆర్ తోట కరీమాబాద్ లోని కివి స్కూల్ లో మంగళవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు తమ ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చిన వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసి సతీశ్ మూర్తి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలు వంటలు నేర్చుకోవడం వల్ల వంటకాలపై ఆసక్తి ఏర్పడుతుందన్నారు.
పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఫుడ్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కివి పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ అన్నదేవర ప్రవీణ్ కుమార్, పాఠశాల డైరెక్టర్ దాసి రజనీ, అధ్యాపకులు రవితేజ, రంజిత పాల్గొన్నారు.