
తిండీతిప్పలు అంటుంటారు. కానీ.. తిండి కోసం తిప్పలు పడి.. ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ ఫుడ్ ప్లేట్స్ కోసం జనం ఆగమైన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్లో వెలుగుచూసింది. భోపాల్లో ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఈ సదస్సు జరిగింది. ఫిబ్రవరి 24న అంతా బానే ఉంది గానీ ఫిబ్రవరి 25న మాత్రం సదస్సులో దారుణమైన దృశ్యాలు కనిపించాయి.
MP Global Investors Summit or
— Newton Bank Kumar (@idesibanda) February 26, 2025
PM Gareeb Kalyan Anna Yojna 😂 pic.twitter.com/c4V1INYLQS
ఈ సదస్సు జరిగిన తర్వాత వచ్చిన వాళ్లందరికీ ఫుడ్ ఏర్పాటు చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కాబట్టి పలు రకాల ఫుడ్ వెరైటీలతో నోటికి పసందైన భోజనం పెట్టారు. ఈ భోజనం కోసం అక్కడికెళ్లిన వాళ్లు ఒకరినొకరు కొట్టుకున్నంత పని చేశారు. పది రోజుల నుంచి తిండే తిననట్టుగా, లైఫ్లో ఫస్ట్ టైం భోజనం చేస్తున్న మాదిరిగా ఫుడ్ కోసం జనం ఎగబడ్డారు. ఫుడ్ ప్లేట్స్ కోసం ఆ ప్లేస్ను చిందరవందర చేశారు.
This rush by fake “investors” to grab the free lunch at the MP Investor Summit sadly reminds me of how many lawyers rush for the food stalls at Bar Functions. 😝😂
— sanjoy ghose (@advsanjoy) February 26, 2025
pic.twitter.com/PpOyZG4otC
ఫుడ్ ప్లేట్స్ను కిందేసి తొక్కారు. పగలగొట్టారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఫ్రీ లంచ్ కోసం ఫేక్ ఇన్వెస్టర్లంతా ఈ ఈవెంట్కు వెళ్లారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ సదస్సుకు ఇన్వెస్టర్లతో పాటు వందల మంది హాజరయ్యారు. వీళ్లలో ఔత్సాహిక వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు కూడా ఉన్నారు.
Urban dehaatism in display at MP investors summit. Soon, Netas and Babus will fight for their share of commision. pic.twitter.com/2hI8UJr2yA
— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) February 26, 2025
భోపాల్లో జరిగిన ఈ సదస్సుకు తొలి రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ హాజరయ్యారు. రూ. 30 లక్షల కోట్ల డీల్స్ టార్గెట్గా జరిగిన ఈ సదస్సులో ఫుడ్ కోసం ఈ మాదిరిగా ఎగబడటం మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికే తలవొంపులు తెచ్చి పెట్టింది.