జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని హోటల్స్, కిరాణ షాపుల్లో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ అనూష గురువారం తనిఖీలు చేపట్టారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించగా అవి నాసిరకంగా ఉన్నట్లు రిపోర్ట్స్ రాగా అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంబంధిత షాప్ యజమానులకు మొదటి తప్పుగా పెనాల్టీ వేశారు.
సామంతల భోజనశాలకు రూ.2.50లక్షలు, సుఖీభవ రెస్టారెంట్ కు రూ.50వేలు, ఆనంద్ భవన్ హోటల్ కు రూ.75వేలు, నందిని సేవా మహల్ కు రూ.35వేలు, బెస్ట్ సూపర్ మార్కెట్ కు రూ.లక్ష, శివసాయి కిరాణానికి రూ.90వేలు, శ్రీ రూపా బెంగళూరు బేకరీకి రూ.30వేల పెనాల్టీ వేశారు.