
భద్రాచలం, వెలుగు: రామాలయంలో సోమవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ తనిఖీలు నిర్వహించారు. తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈఓ రమాదేవి ఫుడ్ ఇన్స్పెక్టర్కు లేఖ రాశారు. దీంతో ఆయన ఆలయంలోని స్టోర్స్ ను సందర్శించారు. అన్నదానం, ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను సేకరించారు. నెయ్యి, నూనె, పప్పులు, పంచదార, పిండి శాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపించి నాణ్యతను టెస్ట్ చేస్తామని ఫుడ్ ఇన్స్ పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు.