సీడబ్ల్యూసీ నేతలకు.. తెలంగాణ వంటకాలతో ఫుడ్ మెనూ

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ ఆతిథ్యాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం చిరకాలం గుర్తుంచుకునేలా పీసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. తొలిరోజు సీడబ్ల్యూసీ సమావేశాల తర్వాత.. తాజ్‌‌ కృష్ణ వెనుకాల ఉన్న ఓపెన్ లాన్‌‌లో డిన్నర్ ఏర్పాట్లు చేశారు. డిన్నర్‌‌‌‌కు ముందు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

 స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మ్యూజిక్‌‌ను అతిథులకు వినిపించారు. గారెలు, మటన్ కర్రీ, హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ, ఇరానీ చాయ్‌‌, ఉస్మానియా బిస్కెట్లు సహా తెలంగాణ వంటకాలతో స్పెషల్ ఫుడ్ మెనూను రూపొందించారు. 

ALSO READ: కాంగ్రెస్​ది అబద్ధాల డిక్లరేషన్​.. మోసపోతే గోసవడ్తం : హరీశ్​రావు

సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా సీడబ్ల్యూసీ నాయకులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి రేవంత్, భట్టి సహా 36 మంది నాయకులు ఈ విందుకు హాజరయ్యారు.