కరీంగనగర్ శర్మనగర్ జ్యోతిభా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. జనవరి 6న రాత్రి క్యాబేజ్ కూరతో డిన్నర్ చేసి పడుకున్న విద్యార్థులకు వాంతులు,విరేచనాలు అయ్యాయి. ఈ ఘటనలో 31 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ALSO READ | కరీంనగర్లో త్వరలో 24/7 తాగునీరు
ఆస్పత్రిలో చేరిన విద్యార్థుల హెల్త్ బులిటెన్ ను జనవరి 7న విడుదల చేశారు కరీంనగర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ . మొత్తం 31 మంది వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారని.. వీరిలో 23 మందిని ఇప్పటికే డిశ్చార్జి చేశామన్నారు. మరికొద్ది సేపట్లో మిగతా 8 మందిని కూడా ఇంటికి పంపిస్తామని.. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.