మహబూబాబాద్ జిల్లా: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిచడంలో ఓ గురుకుల పాఠశాల మరొకసారి విఫలం అయింది. దాంతో ఫుడ్ పాయిజన్ అయి ఏకంగా 15 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన ఘటన మహబూబాబాద్ పట్టణంలోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలో చోటుచేసుకుంది.
పాఠశాలలో రాత్రి టమాటా కూరతో భోజనం చేసిన విద్యార్థినులు ఉదయం అస్వస్థకు గురయ్యారు. అందులో 15 మందికి వాంతులు, విరోచనాలు కావడంతో పరిస్థితిని గమనించిన టీచర్లు.. విద్యార్థినులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులకు టెస్టులు చేసిన డాక్టర్లు రాత్రి తిన్న టమాటా కర్రీ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని నిర్ధారించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు.