- కిచిడీ తిన్న విద్యార్థులకువాంతులు, విరేచనాలు
- 15 మందికి అస్వస్థత..ప్రభుత్వ దవాఖానలో చికిత్స
- 14 మంది డిశ్చార్జ్.. మరొకరికి కొనసాగుతున్న ట్రీట్మెంట్
- పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని స్టూడెంట్స్ ఆరోపణ
- భోజనం బాగానే ఉందని ఆర్డీవో వెల్లడి
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూర్ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో వారిని సిబ్బంది వెంటనే తాండూరు కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స అందించారు.ఇందులో 14 మంది పరిస్థితి అదుపులోకి రావడంతో డిశ్చార్జి చేయగా, ఒక స్టూడెంట్‌కు దవాఖానలోనే ట్రీట్మెంట్ కొనసాగుతున్నది.
సాయిపూర్ట్రైబల్గర్ల్స్హాస్టల్లో 30 మంది గిరిజన విద్యార్థినులు ఉంటున్నారు. సోమవారం ఉదయం టిఫిన్‌లో భాగంగా కిచిడీ పెట్టగా ఇద్దరు విద్యార్థినులకు కడుపునొప్పి వచ్చింది. దీంతో వారికి ఏఎన్ఎం ట్యాబ్లెట్ఇవ్వడంతో తగ్గింది. మంగళవారం ఉదయం మళ్లీ కిచిడీ పెట్టారు. తిన్న వెంటనే 15 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో వారిని తాండూరు ప్రభుత్వ దవాఖానకు, మాతా శిశు హాస్పిటల్‌కు తరలించారు.
క్వాలిటీ లేని ఫుడ్ పెడ్తున్నరు: స్టూడెంట్స్
తమకు రోజూ పురుగుల అన్నం, నీళ్ల చారు, క్వాలిటీ లేని భోజనం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. పురుగులు కనిపించకుండా అన్నం మెత్తగా వండుతున్నారని, నీళ్ల చారు అందిస్తున్నారని వాపోయారు. సోమవారం రాత్రి కూడా వండిన భోజనం తినలేకపోయామని చెప్పారు. కాగా, ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న కలెక్టర్ప్రతీక్జైన్.. విచారణాధికారిగా వికారాబాద్ఆర్డీవో వాసుచంద్ర ను నియమించారు. దీంతో ఆయన హాస్టల్‌ను విజిట్చేశారు.
ఏడుగురు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని, ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మంగళవారం రాత్రి అక్కడ ఉన్న విద్యార్థినులతో కలిసి భోజనం చేశానని తెలిపారు. భోజనం బాగానే ఉందని, ఆందోళన అవసరం లేదన్నారు. విషయం తెలిసి తల్లిదండ్రులు కొందరు హాస్టల్‌కు, మరికొందరు దవాఖానలకు వచ్చారు. తమ పిల్లలకు మంచి భోజనం పెట్టాలని కోరారు. కాగా, ఉదయం స్టూడెంట్‌కు ఫుడ్‌పాయిజన్ జరిగిన విషయం తెలిసిన వెంటనే తాండూర్ తహసీల్దార్తారా సింగ్ కూడా హాస్టల్‌ను విజిట్చేశారు.