![గూడూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..](https://static.v6velugu.com/uploads/2025/02/food-poisoning-at-gudur-gurukul-school-mahabubabad-16-students-hospitalized_vUO6p5lLWB.jpg)
రాష్ట్రంలో గురుకుల పాఠశాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో చోట ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం దామరవంచ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 16 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. గురువారం రాత్రి సాంబార్‌తో అన్నం తిన్న కొద్దిసేపటికే విద్యార్థుల్లో వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది వారిని గుడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ALSO READ | ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని గర్భవతిని చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే..
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్.. ఆస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఏం జరిగిందనే దానిపై.. విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా నాణ్యమైన పుడ్ అందజేయాలని ఎమ్మెల్యే ఆధికారులుకు సూచించారు.