మాగనూర్ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్.. 20 మందికి అస్వస్థత

మాగనూర్ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్.. 20 మందికి అస్వస్థత

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 2024, నవంబర్ 26వ తేదీన స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు వాంతులు, తల నొప్పి, కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురి అయిన విద్యార్థులను మక్తల్ ఆస్పత్రికి తరలించారు. 

ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. వారం వ్యవధిలోనే ఇదే మాగనూరు స్కూల్‎లో రెండోసారి ఫుడ్ పాయిజన్ కావడం గమనార్హం. 2024 నవంబర్ 20వ తేదీన కూడా మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 100  మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. 

ALSO READ | నాణ్యమైన భోజనం అందించాలి : ​ సంచిత్​ గంగ్వార్​

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. చర్యలకు ఉపక్రమించారు. మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారితో పాటు పలువురుని సస్పెండ్ చేసి.. మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు  చేసే ఏజెన్సీ కాంట్రాక్ట్‎ను రద్దు చేశారు. ఇదిలా ఉండగానే అదే మాగనూర్ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం కలకలం రేపుతోంది.