వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్ లో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత భోజనం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన డిసెంబర్ 9న జరిగింది.
తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ (గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల) కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా హాస్టల్లో భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పురుగులతో పాటు మెత్తగా వండుతున్నారని, చారు నీళ్లలా ఉంటుందని విద్యార్థినులు చెబుతున్నారు.
Also Read :- మూడున్నర కోట్ల విలువైన 1100 ఫోన్లు రికవరీ
లేటెస్ట్ గా డిసెంబర్ 9 సోమవారం రాత్రి భోజనం తిన్న 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హాస్టల్ టీచర్ తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు.