- 9 మంది స్టూడెంట్లకు అస్వస్థత, ఇద్దరి పరిస్థితి సీరియస్
యాదాద్రి భువనగిరి, వెలుగు: ఫుడ్ పాయిజన్‌లో 9 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన భువనగిరిలోని గురుకుల హాస్టల్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. హాస్టల్‌లో ఉంటున్న స్టూడెంట్లు శుక్రవారం రాత్రి మజ్జిగతో పాటు కిచిడీ తిన్నారు. అనంతరం 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే హాస్టల్ నిర్వాహకులు స్టూడెంట్లను భువనగిరి జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.
ఆరో తరగతి చదువుతున్న ప్రశాంత్, కృష్ణ పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. భువనగిరి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న స్టూడెంట్లను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం పరామర్శించారు. మెరుగైన ట్రీట్‌మెంట్ అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అలాగే స్టూడెంట్లను బీజేపీ లీడర్లు బూర నర్సయ్య గౌడ్, పాశం భాస్కర్ పరామర్శించారు.