ధన్వాడ హైస్కూల్‌‌లో ఫుడ్‌‌ పాయిజన్‌‌.. 23 మంది స్టూడెంట్లకు అస్వస్థత

ధన్వాడ హైస్కూల్‌‌లో ఫుడ్‌‌ పాయిజన్‌‌.. 23 మంది స్టూడెంట్లకు అస్వస్థత

ధన్వాడ, వెలుగు : ఫుడ్‌‌ పాయిజన్‌‌ కారణంగా 23 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ధన్వాడ బాయ్స్‌‌ హైస్కూల్‌‌లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బాయ్స్‌‌ హైస్కూల్‌‌ స్టూడెంట్లకు బుధవారం మధ్యాహ్న భోజనంలో ఆలుగడ్డ, వంకాయతో చేసిన కూర, అన్నం పెట్టారు. ఒంటి గంటకు భోజనం చేసిన స్టూడెంట్లు సాయంత్రం 4 గంటల టైంలో అస్వస్థతకు గురయ్యారు. 

నలుగురు స్టూడెంట్లకు వాంతులు కాగా, మిగతా వారు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో అస్వస్థతకు గురైన స్టూడెంట్లను హెచ్‌‌ఎం నరసింహ వెంటనే హాస్పిటల్‌‌కు తరలించారు. ప్రస్తుతం స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితి బాగుందని డాక్టర్లు తెలిపారు.