విద్యా స్థంస్థల్లో ఆకస్మిక తనిఖీలు..సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లల్లో తనిఖీలు చేయాలంటూ సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఆదేశించడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఈ మేరకు శుక్రవారం ఆయా జిల్లాల ఇన్‌‌‌‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, విద్యా కమిషన్, విద్యాశాఖ అధికారులు, గురుకులాల సెక్రటరీ లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు విద్యా సంస్థలు, హాస్టళ్లు, స్కూళ్లను ఆకస్మికంగా సందర్శించారు.

స్టూడెంట్స్‌‌‌‌తో కలిసి భోజనం చేశారు. కలెక్టర్లు గురుకులాల్లో స్టూడెంట్స్‌‌‌‌తో కలిసి నిద్రిస్తున్నారు. గురువారం సంగారెడ్డి నుంచి విద్యా కమిషన్ గురుకులాలు, హాస్టళ్లు, స్కూళ్ల సందర్శన ప్రారంభించింది. డిసెంబర్ 7 వరకు వీటిని సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.