
రామాయంపేట, వెలుగు : మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం బీసీ హాస్టల్ లో మంగళవారం ఫుడ్ పాయిజన్‌తో ఆరుగురు స్టూడెంట్స్అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అన్నం తిన్న తరువాత స్టూడెంట్స్ గిరి, తరుణ్, రఘు, అశ్విన్, రాము, వశీకరణ్ తలనొప్పి, కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నారు. దీంతో వార్డెన్ స్వామి వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు.
నల్ల పురుగులతో కూడిన అన్నాన్ని తినడం వల్లే ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని అస్వస్థతకు గురైన స్టూడెంట్స్ తల్లిదండ్రులు, గ్రామస్తులు వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శంకర్ ధర్మారం హాస్టల్‌ను సందర్శించారు. జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.